ఎరువులు:
ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
ఎకరాకు నీటి పారుదల పంటకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం+12 కిలోల పోటాస్ను, వర్షాధార పంటకు 24 కిలోల నత్రజని + 12 కిలోల భాస్వరం + 8 కిలోల పోటాస్ ఇచ్చు రసాయనిక ఎరువులు వేయాలి.
నత్రజనిని విత్తేటప్పుడు సగం, మొత్తం పోటాస్ ను, భాస్వరం ఎరువులను విత్తేటపుడు/ నాట్లు వేసేటప్పుడు వేయాలి. మిగతా సగభాగం నత్రజనిని విత్తిన 25-30 రోజుల వయసు మొక్కలకు పైపాటుగా వేయాలి.